ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ రామేశ్వరంలో దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాంకి నివాళులర్పించారు. ఆయన సమాధిని సందర్శించిన ఆయన కలాం సేవలు గుర్తు చేసుకున్నారు.

కేసీఆర్ వెంట కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. రేపు ఆయన మధురై వెళ్లనున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయిన కేసీఆర్.. డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో చర్చలు జరపనున్నారు.