హైదరాబాద్: ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీగా కురుస్తున్ననాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు అధికారులను ఆదేశించారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్  కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చింది. 

సుమారు 75 శాతం వరద వచ్చే అవకాశం ఉంది సీడబ్ల్యుసీ రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చింది.కృష్ణా పరివాహక రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.ఎగువన భారీ వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు కూడ భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. 

దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని సీఎం కేసీఆర్ ఇవాళ ఆదేశించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈకీ ఈ మేరకు కేసీఆర్ ఇవాళ ఆదేశించారు.

నీటి ప్రవాహం ఉన్నందున ఈ సారి నల్గొండ, ఖమ్మం పరిధిలో సాగర్ ఆయకట్టు రైతులకు ఈ వానా కాలం పంటల కోసం పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సీఎం చెప్పారు.