కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించాలి:అధికారులకు కేసీఆర్ ఆదేశం


కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారంనాడుఆదేశాలు జారీ చేశారు.త్వరలోనే ఈ విషయమై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Telangana CM kCR Orders To  regularize contract lecturers

హైదరాబాద్:కాంట్రాక్టు లెక్చరర్లను  క్రమబద్దీకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారంనాడుఆదేశాలు జారీ చేశారు.  రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్నవారిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.  తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్టుగా  ప్రకటించింది.ఈ  దిశగా  కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టింది.2016 ఫిబ్రవరి 26న 16 నెంబర్ జీవోను జారీ చేసింది. అయితే ఈ జీవోపై మహబూబ్ నగర్  జిల్లాకు చెందినఅభ్యర్ధి ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుకూలంగా ఈ ఏడాది సెప్టెంబర్ 20న  తీర్పును వెల్లడించింది. దీంతో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది.దీంతో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీని చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఇవాళ ఆదేశించారు. ఇప్పటికే  అర్హులైన కాంట్రాక్టు లెక్చరర్ల జాబితాను ప్రభుత్వానికి పంపారుఅధికారులు.త్వరలోనే కాంట్రాక్టు లెక్చరర్ల  పోస్టులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించే అవకాశం ఉంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios