Asianet News TeluguAsianet News Telugu

రైతాంగానికి కేసీఆర్ శుభవార్త.. యాసంగి ధాన్యం కొనుగోలుకు సీఎం ఆదేశాలు

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి యేటా 7 వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్న సంగతి తెలిసిందే.

telangana cm kcr orders to officials for open rabi paddy procurement centers ksp
Author
First Published Apr 9, 2023, 8:49 PM IST

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్టవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని సీఎస్ శాంతికుమారికి ముఖ్యమంత్రి సూచించారు. దీంతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి యేటా 7 వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం దీనికి సంబంధించిన నగదును కూడా రైతుల ఖాతాలోనే జమ చేస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios