Asianet News TeluguAsianet News Telugu

రైతులకు శుభవార్త .. ఈ నెల 28న రైతు బంధు నిధుల విడుదల, సీఎస్‌కు కేసీఆర్ ఆదేశం

తెలంగాణ రైతులకు  సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 28న రైతు బంధు నిధులను విడుదల చేయాల్సిందిగా సీఎస్‌ను కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటిలాగే వరుస క్రమంలో రైతుల ఖాతాలో నగదు జమ కానుంది. 

telangana cm kcr orders to cs over rythu bandhu
Author
Hyderabad, First Published Jun 22, 2022, 6:40 PM IST

తెలంగాణ రైతులకు  సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 28న రైతు బంధు నిధులను విడుదల చేయాల్సిందిగా సీఎస్‌ను కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటిలాగే వరుస క్రమంలో రైతుల ఖాతాలో నగదు జమ కానుంది. 

ఇకపోతే.. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ కింద.. రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.10వేల పెట్టుబడి సాయం అందజేస్తున్నది. జూన్‌ 1న ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 20 రోజులు దాటినా.. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జయచేయలేదు.  సాధారణంగా జూన్‌ ప్రారంభంలో ఖరీఫ్‌ లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తున్న ప్రభుత్వం.. రెండో వారంలో నిధులు విడుదల చేసి జూన్‌ 15 నుంచి 20 వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. అయితే ఈసారి మాత్రం ఆ ప్రక్రియలో ఆలస్యం చోటుచేసుకుంది. దీంతో ప్రభుత్వం రైతు బంధు నిధులు ఎప్పుడు జమ చేస్తుందో అనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios