సీఎస్‌ను ఢిల్లీకి రావాలని కేసీఆర్ ఆదేశం:మరో మూడు రోజులు హస్తినలోనే సీఎం

తెలంగాణ సీఎస్,   ఇతర  సీనియర్  అధికారులను  సీఎం కేసీఆర్ సోమవారం నాడు ఢిల్లీకి రావాలని ఆదేశించారు. కేసీఆర్ ఇంకా రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటారు.దీంతో   పాలన  పరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను కేసీఆర్  అధికారులను ఢిల్లీకి రావాలని కోరారు.

Telangana CM KCR Orders CS and DGP  to Come Delhi

హైదరాబాద్:తెలంగాణ సీఎస్  సోమేష్  కుమార్ ,సహా కొందరు కీలక  అధికారులను ఢిల్లీకి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి  రేపటితో  వారం రోజులు పూర్తి కానుంది. ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్  యాదవ్  పార్థీవ దేహానికి నివాళులర్పించిన తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లారు  సీఎం. మంగళవారం నుండి  కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇంకా  మూడు నాలుగు రోజులు కేసీఆర్  హస్తినలో ఉంటారు. దీంతో  పరిపాలన పరమైన విషయమై చర్చించేందుకు గాను   అధికారులను కేసీఆర్   ఢిల్లీకి పిలిచారు. దీంతో సీఎస్ సోమేష్ కుమార్ సహా సీనియర్ అధికారులు సోమవారం నాడు ఢిల్లీ బయలు దేరారు.  ఇటీవల కాలంలో  రాష్ట్రంలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలు,ఇతర  అంశాలపై అధికారులతో కేసీఆర్  చర్చించనున్నారు.

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.బీఆర్ఎస్  ను దేశంలోని  పలు  రాష్ట్రాల్లో విస్తరించేందుకు గాను కేసీఆర్  ఢిల్లీ వేదికగా  చర్చలు నిర్వహిస్తున్నారు. పలు పార్టీల నేతలతో పాటు రిటైర్డ్ అధికారులు, రైతు సంఘాల నేతలతో కేసీఆర్ చర్చలు  జరుపుతున్నారు. దీంతో కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు.  దీంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  కేసీఆర్  అధికారులతో చర్చించనున్నారు.ఈ  మేరకు అధికారులను కేసీఆర్  ఢిల్లీకి  రప్పించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios