Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ విద్యాశాఖలో సర్క్యులర్ కలకలం: ఐఎఎస్‌పై బదిలీ వేటు

తెలంగాణ విద్యాశాఖలో  సర్క్యలర్ వివాదాస్పదంగా మారింది. ఈ విషయం తెలుసుకొన్న సీఎం కేసీఆర్  ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ కారణంగానే ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు పడింది.

Telangana Cm KCR order to serious action on Education department controversial circular
Author
Hyderabad, First Published Feb 19, 2020, 11:49 AM IST

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ సర్క్యులర్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.  సీఎం, సీఎస్‌కు సమాచారం లేకుండానే ఈ సర్క్యులర్ జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also read:పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించకపోతే పదవుల్లో నుండి తొలగాలి: కేసీఆర్ వార్నింగ్

వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి 15వ తేదీ వరకు  ఎలాంటి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించకూడదని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సర్క్యులర్ వచ్చింది. పాఠశాల డిప్యూటీ సెక్రటరీ నుండి  ఈ ఉత్తర్వులు అందాయి. అయితే ఈ ఉత్తర్వుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఎన్‌పీఆర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  ఈ తరుణంలో ఎన్‌పీఆర్, జనాభా లెక్కల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా వచ్చే ఏడాది జనవరి నుండి  మార్చి 15 వరకు ఎలాంటి పరీక్షల షెడ్యూల్‌ను పెట్టుకోవద్దని  ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా టీఆర్ఎస్  వ్యవహరిస్తోంది.  సీఏఏ, ఎన్‌ఆర్‌సీ విషయంలో పార్లమెంట్‌లో కూడ  టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు చేసింది. ఈ తరుణంలో  విద్యాశాఖలో జారీ చేసిన ఈ సర్క్యులర్ వివాదస్పదంగా మారింది.

సీఎం , సీఎస్‌కు సమాచారం లేకుండానే ఈ ఉత్తర్వులు  జారీ అయ్యాయని చెబుతున్నారు. ఈ విషయం సీఎం దృష్టికి రావడంతో ఓ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు వేశారు.  మరికొందరు అధికారులపై సీరియస్ అయినట్టుగా సమాచారం. 


 


 

Follow Us:
Download App:
  • android
  • ios