తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అమ్మవారికి ముక్కుపుడకను సమర్పిస్తానని కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మొక్కుకొన్నారు.ఈ మొక్కును తీర్చుకొనేందుకు గాను కేసీఆర్ కటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో  గురువారం నాడు విజయవాడకు వచ్చారు.

విజయవాడకు చేరుకొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ దపంతులకు ఏపీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహాన్ సింగ్, కృష్ణా జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా ఎస్పీ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్,  విజయవాడ దేవాలయ చైర్మెన్ బాబు, ఈవో పద్మ తదితరులు సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు.

అమ్మవారికి కేసీఆర్ దంపతులు సమర్పించిన ముక్కుపుడకను11.29 గ్రాముల బంగారంతో తయారు చేయించారు.ఈ ముక్కుపుడకలో 57 వజ్రాలు ఉంటాయి.గన్నవరం విమానాశ్రయం వద్ద నుండి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొనే కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు దగ్గరే ఉన్నారు. 

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి  విజయవాడ దుర్గగుడి  వద్దకు ముందే చేరుకొని సీఎం కేసీఆర్  పర్యటన కార్యక్రమానికి సంబందించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ విజయవాడ పర్యటనను పురస్కరించుకొని  విజయవాడ దుర్గగుడిపై కేసీఆర్ అభిమానులు కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 

అయితే  వీటిని తొలగించాలని దేవాలయ అధికారులు కోరారు. మరికొందరు కేసీఆర్ కు అనుకూలంగా  నినాదాలు చేశారు. దేవాలయంలోకి వెళ్లే సమయంలో కేసీఆర్ గుడి వద్ద భక్తులకు అభివాదం చేశారు.