కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజధానులను జాతీయ రహదారులుగా మార్చాలని ఆయన కోరనున్నారు.ఇప్పటికే జాతీయ రహదారులుగా మార్చిన వాటికి నెంబర్లు కేటాయించాలని కోరనున్నారు.

హైదరాబాద్: కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సాయంత్రం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.హైద్రాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేసినందుకుగాను గడ్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 1వ తేదీన సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆ రోజు నుండి ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ నెల 3వ తేదీ నుండి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షాతో భేటీ అయ్యారు. మరో వైపు ఇవాళ కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో ఆయన భేటీ అయ్యారు.

రాష్ట్రానికి కొత్త జాతీయ రహదారులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కేసీఆర్ కోరుతారు. అదే విధంగా గతంలో మంజూరు చేసిన రోడ్డు మార్గాలకు నెంబరింగ్ ను కూడా కేటాయించాలని ఆయన కోరనున్నారు. జాతీయ రహదారులకు నిధులను కేటాయించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరనున్నారు.

జాతీయ రహదారులను గ్రీన్ హైవేలుగా మార్చే క్రమంలో వాటి నిర్వహణ బాధ్యతను రాష్ట్రానికి బదలాయించాలని సీఎం కేసీఆర్ కోరనున్నారు. నితిన్ గడ్కరితో భేటీ తర్వాత సీఎం కేసీఆర్ ఇవాళ రాత్రికి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ కానున్నారు.