కొత్త సచివాలయంలో మందిరం, మసీదు, చర్చిని ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. శనివారం ముస్లిం మత పెద్దలతో ఆయన సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... మసీదు నిర్మాణం పూర్తయ్యాక వక్ప్‌బోర్డుకు అప్పగిస్తామని వెల్లడించారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖకు అప్పగిస్తామన్నారు.

ముస్లిం అనాథ పిల్లల కోసం మరో రూ.18 కోట్లు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇస్తామిక్ సెంటర్ పనులు వెంటనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో 200 ఎకరాల్లో ఖబరిస్తాన్‌లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక మూడింటికి శంకుస్తాపన చేస్తామన్నారు.