Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం మనదే : టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆరు జిల్లాల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. 

telangana cm kcr meet with trs leaders over mlc elections
Author
Hyderabad, First Published Oct 3, 2020, 9:28 PM IST

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆరు జిల్లాల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. యువకులు, నిరుద్యోగులు టీఆర్ఎస్‌కు వ్యతిరేకం కాదన్నారు. అలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. రెండు ఎమ్మెల్సీ సీట్లతో పాటు కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపు మనదేనని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

నిరుద్యోగులు, విద్యావంతులు, యువకులు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్‌పై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.

అలాగే త్వరలో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే కొత్త రెవెన్యూ చట్టంపై ఎమ్మెల్యేలకు ఉన్న సందేహాలు నివృత్తి చేశారు కేసీఆర్. ఉద్యమ కాలం నుంచి యువత అంతా టీఆర్ఎస్‌తోనే ఉన్నారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

పట్టభద్రుల ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే ఆస్తులన్నీ రికార్డుల్లోకి ఎక్కేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios