తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కొల్హాపూర్ బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకొంటారు.
హైదరాబాద్:తెలంగాణ సీఎం KCR కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు బయలుదేరారు. Kolhapurలోని మహాలక్ష్మి అమ్మవారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు.
కుటుంబ సమేతంగా జై అంబే Mahalakshmi అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో ఇవాళ బేగంపేటలోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ కొల్హాపూర్ బయలుదేరి వెళ్లారు. దర్శనానంతరం సాయంత్రం Hyderabad తిరిగి వస్తారు.
