తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 3న కేసీఆర్ ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి వస్తారు.


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 2వ తేదీన న్యూఢిల్లీలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.ఇవాళ ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ భవన నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు కేంద్రం నుండి భూమి పత్రాలను తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గతంలోనే తీసుకొన్నారు.

ఈ నెల 2వ తేదీన మంచి ముహుర్తం ఉన్నందున ఢిల్లీలో పార్టీ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను కేటీఆర్ సహా పలువురు మంత్రులు, నేతలు ఇవాళ ఉదయమే ఢిల్లీకి వెళ్లారు.రేపు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు. ఈ నెల 3వ తేదీన కేసీఆర్ ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి వస్తారు.