శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మహిళల భద్రతకు తాము అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన చెప్పారు.

అటవీ సంపద కొల్లగొట్టేవారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని సీఎం హెచ్చరించారు. స్మగ్లింగ్ అరికట్టడంలో సివిల్ పోలీసులు భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు.

గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపాలని.. దేశంలో దళితులపై దాడులు శోచనీయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫేక్ సర్టిఫికెట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని.. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీలో ఆలస్యం తగదని సీఎం పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని.. త్వరలోనే వినియోగంలోకి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.