తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌ను విస్తరించే పనిలో సీఎం వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గంప గోవర్ధన్, పట్నం మహేందర్ రెడ్డిలను ఆయన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్‌లో మార్పు, చేర్పులు చేయనున్నారా.. ఖాళీగా వున్న ఈటల స్థానంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని తీసుకునే అవకాశం వుందని సమాచారం. మరొకరికి ఉద్వాసన పలకనున్నట్లుగా తెలుస్తోంది. అతని స్థానంలో గంప గోవర్థన్‌ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పాండిచ్చేరి నుంచి రాత్రికి హైదరాబాద్ రానున్నారు గవర్నర్ తమిళిసై సౌందరాజన్. కేబినెట్ విస్తరణపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.