Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్: ప్రారంభించిన సీఎం కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు హైద్రాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోలో  భవనాన్ని ప్రారంభించారు. 

Telangana CM KCR  inaugurates  Police Command and Control Centre
Author
Hyderabad, First Published Aug 4, 2022, 1:21 PM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను హైద్రాబాద్ లో గురువారం నాడు ప్రారంభించారు. 600 కోట్లతో 20 అంతస్థుల్లో ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. 2016 నవంబర్‌ 22న ఈ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.  ఆరేళ్ల పాటు ఈ సెంటర్ నిర్మాణ పనులు జరిగాయి..ఈ  సెంటర్ లో ప్రతి భవనంలో సౌకర్యాలను తెలంగాణ సీఎం కేసీఆర్ కు  తెలంగాణ డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. పోలీస్ శాఖ ఏరన్పాటు చేసిన ఫోటో ె ఎగ్జిబిషన్ ను సీఎం కేసీఆర్ తిలకించారు.

హైద్రాబాద్ సీపీ కార్యాలయంలో  జరిగిన సర్వమత ప్రార్ధనల్లో సీఎం పాల్గొన్నారు.  సీపీ ఆనంద్ ను కుర్చీలో కూర్చోబెట్టి సీఎం అభినందించారు.. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎలా పనిచేస్తోందో కూడా సీఎం కేసీఆర్ కు పోలీసు అధికారులు వివరించారు.జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల వద్ద ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మరో వైపు జాతీయ రహదారుల దృశ్యాలను చూపాలని కేసీఆర్ కోరగానే ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దృశ్యాలను సీఎం కు చూపారు అధికారులు. యాదాద్రి ఆలయం, భద్రాద్రి ఆలయం వద్ద సీసీకెమెరాల దృశ్యాలను కూడా అధికారులు సీఎం కేసీఆర్ కు చూపారు. 

 ఈ సెంటర్ లో మొత్తం ఐదు టవర్లున్నాయి. ఏ, బీ, సీ, డీ, ఈ   బాగాలుగా టవర్లను విభజించారు.  ఏడు ఎకరాల్లో 6.42 లక్షల చదవుపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ ను నిర్మించారు. టవర్ ఏ లో 15 అంతస్థులు, టవర్ బీ లో 20 అంతస్థుల్లో భవనాలు నిర్మించారు. 

మీడియా ట్రైనింగ్ సెంటర్ ను సీ టవర్ లో, త్రీ లెవల్ థియేటర్ ను ఢీ టవర్  లో ఏర్పాటుచేశారు.ఇక్కడ పనిచేసే సిబ్బందితో పాటు ఇక్కడకు వచ్చే విజిటర్లు, వీవీఐపీల వాహనాల పార్కింగ్  కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. 600 ఫోర్ వీలర్స్, 350 టూ వీలర్స్ పార్క్ చేసేలా పార్కింగ్ ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలుసుకొనే టెక్నాలజీని ఇక్కడ సమకూర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రదేశాన్నైనా ఈ కెమెరాల ద్వారా చూసే వీలుంటుంది.

. దొంగలు, కిడ్నాపర్లను వెంటనే పట్టుకొనేందుకు ఈ కెమెరాల సహాయం తీసుకొంటారు పోలీసులు. టవర్ ఏలో హైద్రాబాద్ సీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు.  ఈ కమాండ్ కంట్రోల్ భవనం ఎత్తు 83. 5మీటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేసినట్టుగా పోలీస్ అధికారులు చెబుతున్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా ఎనలిటిక్స్ యూనిట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొత్తగా సోషల్ మీడియా విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios