Asianet News TeluguAsianet News Telugu

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్: ప్రారంభించిన సీఎం కేసీఆర్

భద్రాద్రి కొత్తగూడెం  నూతన  కలెక్టరేట్  ను తెలంగాణ సీఎం కేసీఆర్  గురువారంనాడు  ప్రారంభించారు . ఇవాళ ఉదయమే  మహబూబాబాద్  కలెక్టరేట్  ను సీఎం ప్రారంభించారు.  

Telangana CM KCR inaugurates Bhadradri kothagudem new Collector building
Author
First Published Jan 12, 2023, 4:03 PM IST

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం నూతన కలెక్టరేట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్  గురువారం నాడు  ప్రారంభించారు. మహబూబాబాద్ లో  కలెక్టరేట్  కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత   భద్రాద్రి  కొత్త కలెక్టరేట్  కార్యాలయాన్ని  ప్రారంభించారు.  భద్రాచలం కలెక్టరేట్  భవనం ప్రారంభించడానికి ముందు పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం స్వీకరించారు.   కొత్త కలెక్టరేట్   కార్యాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కలెక్టర్ చాంబర్ లో  సర్వమత ప్రార్ధనలు  చేశారు. కలెక్టర్ ను  కేసీఆర్  కుర్చీలో  కూర్చోబెట్టారు. ఈ నెల  18న  ఖమ్మం కొత్త కలెక్టరేట్ ను  సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.  ఇప్పటికే  రాష్ట్రంలోని  14 జిల్లాల్లో  కొత్త కలెక్టరేట్లను కేసీఆర్ ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరో  ఎనిమిది కలెక్టరేట్లను  ప్రారంభిస్తారు.  తెలంగాణ  ఏర్పాటైన తర్వాత  కొత్తగా  ఏర్పాటై న జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లను  ప్రభుత్వం నిర్మించింది. 

also read:మహబూబాబాద్ కొత్త కలెక్టరేట్ భవనం: ప్రారంభించిన సీఎం కేసీఆర్

 అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు  జిల్లా ఉన్నతాధికారుల  నివాసాలను  కూడా కొత్త  కలెక్టరేట్ల ఆవరణలో  నిర్మిస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయాలకు  వచ్చే ప్రజలకు   కూడా సౌకర్యాలు ఏర్పాటు  చేశారు.  సమావేశాల నిర్వహణకు కలెక్టరేట్లలో  సమావేశ మందిరాలను  ఏర్పాటు  చేశారు.  కలెక్టరేట్  కార్యాలయాలకు  వచ్చే వారి వాహనాల పార్కింగ్  కోసం  ప్రత్యేక మైన  పార్కింగ్  స్థలాన్ని ఏర్పాటు  చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios