సూర్యాపేటలో కేసీఆర్ టూర్: కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం

సూర్యాపేటలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నూతన కలెక్టరేట్ తో పాటు  పలు ప్రభుత్వ కార్యాలయాలను సీఎం ప్రారంభించారు.

Telangana CM KCR inaguarates  New Collectorate  Building in Suryapet lns

 

సూర్యాపేట: సూర్యాపేటలో  పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు పాల్గొన్నారు.

 

సూర్యాపేటలో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం  మెడికల్ కాలేజీని  కూడ  సీఎం  ప్రారంభించారు.  సూర్యాపేటలో  నూతన కూరగాయల మార్కెట్, ప్రారంభించారు. ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవం తర్వాత  సూర్యాపేటలో నిర్వహించే సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.  జిల్లా అభివృద్దితో పాటు  రాష్ట్రంలో  చేసిన అభివృద్దిని కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. 

Telangana CM KCR inaguarates  New Collectorate  Building in Suryapet lns

కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో  కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను  రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కొత్త కలెక్టరేట్లలో  అన్ని  ప్రభుత్వ  శాఖల కార్యాలయాలుంటాయి.  అంతేకాదు  ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే  విజిటర్ల కోసం పార్కింగ్ సౌకర్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరో వైపు   వందల మందితో  ఒకేసారి  సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా  కూడ  సమావేశ మందిరాలను  కూడ  ఏర్పాటు చేశారు. ప్రభుత్వ  కార్యాలయాలకు  సమీపంలోనే  ప్రభుత్వ అధికారుల  కార్యాలయాలను  కూడ  నిర్మించారు. 

ప్రతి జిల్లాకు  మెడికల్ కాలేజీని ఏర్పాటు  చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే  సూర్యాపేటలో నిర్మించిన కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ  భవనాన్ని సీఎం కేసీఆర్  ప్రారంభించారు.  ప్రతి జిల్లాలో  ఇక నుండి  ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వం  ఏర్పాటు చేయనుంది.ఈ  దిశగా  రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సూర్యాపేటలో రూ. 156 కోట్లతో  మెడికల్ కాలేజీని  నిర్మించారు.

సూర్యాపేటలో  సీఎం కేసీఆర్ బహిరంగ సభను పురస్కరించుకొని జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను మళ్లించారు. విజయవాడ  నుండి హైద్రాబాద్ వెళ్లే వాహనాలను  కోదాడ, మిర్యాలగూడ, నార్కట్ పల్లి మీదుగా మళ్లించారు. హైద్రాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనాలను  నార్కట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios