దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్: ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్

 సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం విధి విధానాల రూపకల్పన కోసం అఖిలపక్షాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ప్రధాన పార్టీలకు చెందిన  దళిత సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. 

Telangana CM KCR holds meeting on Dalit empowerment scheme lns

 సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం విధి విధానాల రూపకల్పన కోసం అఖిలపక్షాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ప్రధాన పార్టీలకు చెందిన  దళిత సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. 

పార్టీలతో సంబంధం లేకుండా దళిత నేతలను కూడ  ఈ సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. వీరిలో ఎక్కువగా మాజీ ఎమ్మెల్యేలున్నారు. అసెంబ్లీలో ఆయా శాసనసభపక్ష నేతలతో పాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ ఎంపీలు మంద జగన్నాథం, మాజీ మంత్రులు మోత్కుపల్ని నర్సింహ్ములు, ప్రసాద్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఎస్సీ సబ్‌ ప్లాన్‌తో సంబంధం లేకుండా ఈ పథకానికి ప్రత్యేకంగానే నిధులు ఖర్చు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, ఆదివారం నిర్వహించనున్న (అఖిలపక్ష) సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios