Asianet News TeluguAsianet News Telugu

వారికి కరోనా లక్షణాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్

తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి.

Telangana CM KCR holds high level meeting on tomorrow over Coronavirus
Author
Hyderabad, First Published Mar 18, 2020, 8:50 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి.

ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన విదేశీయులకు కరోనా లక్షణాలు వున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ల వల్లే కరోనా వ్యాపిస్తోందని, విదేశాల నుంచి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా అన్ని పరీక్షలు చేయించుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read:సెలవులు రద్దు, ఆరు కరోనా పాజిటివ్ కేసులు: ఈటల రాజేందర్

పరీక్షల తర్వాతే విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఇళ్లకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. సామూహిక పండగలకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లలో ప్రయాణీకుల రద్దీ పడిపోయింది, వైరస్ వ్యాప్తి చెందకుండా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు.  

స్కాట్లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తేలిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు సెలవులను  రద్దు చేసినట్టుగా ఆయన చెప్పారు. 

బుధవారం నాడు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తేలిందని ఆయన ప్రకటించారు.

విదేశాల నుండి వచ్చేవారిని నేరుగా క్వారంటైన్ కు తరలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరికొందరు అధికారులను నియమించినట్టుగా ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వైద్యశాఖాధికారులతో  ఇవాళ ఉదయం సుధీర్ఘంగా చర్చించినట్టుగా మంత్రి చెప్పారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకొన్నామన్నారు.  హైద్రాబాద్ నుండి గుల్బర్గా వెళ్లి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినట్టుగా  మంత్రి తెలిపారు. తెలంగాణలో ఒక్కరికి కూడ ఈ వ్యాధి సోకలేదన్నారు.

Also Read:కరోనా: మలేషియా నుండి స్వదేశానికి 250 మంది తెలుగు విద్యార్థులు

విదేశాల నుండి  సుమారు 20 వేల మంది వస్తారని తమకు సమాచారం ఉందని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే వారందరికీ క్వారంటైన్ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

ఎయిర్ పోర్టు నుండి  వదేశాల నుండి వచ్చే ప్రయాణీకులను నేరుగా దూలపల్లి, వికారాబాద్ ఐసోలేషన్ వార్డులకు తరలించేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టుగా మంత్రి స్పష్టం చేశారు. ఎయిర్ పోర్టు నుండి 40 బస్సుల ద్వారా ప్రయాణీకులను తరలిస్తామన్నారు.  గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో  ఉన్న ఐపీఎంలలో అన్ని ఏర్పాట్లు చేశామని ఈటల తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios