రూ.37 వేల కోట్ల పంట రుణాలు మాఫీ: గోల్కోండకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకుని తెలంగాణ సీఎం  కేసీఆర్ ఇవాళ .గోల్కొండ  కోటలో  జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.

Telangana CM KCR  hoists  National Flag  at Golconda Fort  in Hyderabad lns

హైదరాబాద్:దేశంలో  వనరులు చాలా ఉన్నా కూడ  వాటిని  సంపూర్ణంగా వినియోగించుకోవడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం  చేశారు.ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని  మంగళవారంనాడు  హైద్రాబాద్ లో గోల్కోండ కోటలో జాతీయ పతాకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు   రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  నిరంతర విద్యుత్ తో  తెలగాణ వెలిగిపోతోందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒకప్పుడు  నీటి చుక్క కోసం  అలమటించిన  తెలంగాణ ఇప్పుడు  జలధారలు పారుతున్నాయన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి నిరంతర విద్యుత్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా  అధికార యంత్రాంగం చేపట్టిన  చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయని  సీఎం కేసీఆర్  చెప్పారు.

సమైక్య పాలనలో  వరి ఉత్పత్తిలో తెలంగాణ 15వ స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  వరి ఉత్పత్తిలో  అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నట్టుగా కేసీఆర్ వివరించారు.రైతులకు  మూడు గంటల పాటు విద్యుత్ ఇస్తే  సరిపోతుందని  కొందరు వక్రభాష్యం చెబుతున్నారని  పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను  ఆయన  ప్రస్తావించారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకొనేందుకు కేసులు వేశారని  ఆయన పరోక్షంగా కాంగ్రెస్ నేతలనుద్దేశించి విమర్శలు చేశారు. ఇప్పటి వరకు  రాష్ట్రంలో  రూ. 37వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసినట్టుగా కేసీఆర్ వివరించారు.

 దార్శనిక దృక్పథం, పారదర్శక విధానాలు,  అభివృద్ధి, సంక్షేమంలో  తెలంగాణ కొత్త పుంతలు తొక్కిందన్నారు. “తెలంగాణ ఆచరిస్తుంది - దేశం అనుసరిస్తుంది” అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచిందని కేసీఆర్  చెప్పారు.దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం  3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో  నిలిచిందన్నారు. అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు అయి1,255 యూనిట్లను అధిగమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

ఇవాళ్టి నుండి హైద్రాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేపట్టనున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. మరో వైపు ప్రతి నియోజకవర్గంలో  మూడు వేల మందికి గృహలక్ష్మి పథకం కింద   ఆర్ధిక సహాయం అందిస్తామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మ ఉచితంగా  మంచినీరు అందిస్తున్నామన్నారు.  రాష్ట్రప్రభుత్వం  అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే  దిక్సూచిగా నిలుస్తుందని  సీఎం కేసీఆర్  చెప్పారు.ఆసరా పెన్షన్లను  రూ. 2016కు  పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios