దేశంలోనే పెద్దమొత్తంలో పంపుసెట్లను వినియోగించేది తెలంగాణ రాష్ట్రమేనన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గురువారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సీఎం పరిశీలించారు.

అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్క బోరు వేయడానికి రూ.25 వేల నుంచి 1.50 వరకు ఖర్చు పెట్టి.. 800 నుంచి 900 అడుగులు వేస్తే తప్పించి నీరురాని పరిస్ధితి నెలకొందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పాలమూరు    జిల్లా వలసల జిల్లా కావడానికి కారకులు గత పాలకులేనని సీఎం ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతుల సమస్యలపై టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ అవగాహన ఉందని.. దీనిపై నిపుణులు, మేధావుల నుంచి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరిస్తామని కేసీఆర్ తెలిపారు.

రైతులు ఆర్ధికంగా కోలుకునే వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. జూరాలపై అధికంగా ఆధారపడుతున్నామని.. ఆ ప్రాజెక్ట్ ఎండిపోయిన ప్రతీసారి కర్ణాటకను బతిమాలాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల సంఘం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రశంసిస్తుంటే కొంతమంది సన్నాసులు అవాకులు చవాకులు పేలుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

13 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ సీట్లు, ఐదు జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్‌కు కట్టబెట్టి పాలమూరు ప్రజలు తమను గుండెల్లో పెట్టుకున్నారని.. వారి రుణం తీర్చుకుంటామని సీఎం తెలిపారు. కాంట్రాక్టర్లు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని.. రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసి పాలమూరును పాలుగారే వూరుగా తయారు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై ఆ మాటలెందీ: బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు

గోదావరి నీరు శ్రీశైలం తరలింపు: జగన్, కేసీఆర్ నిర్ణయం

మరోసారి జగన్, కేసీఆర్ భేటీ... అసలు మ్యాటర్ ఇదే

ప్రగతి భవన్ కు తొలిసారి జగన్: కేసీఆర్ తో భేటీ