Asianet News TeluguAsianet News Telugu

తిరునగరి రామానుజయ్య మృతి : సాహిత్య లోకానికి తీరని లోటు కేసీఆర్ సంతాపం...

రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సంప్రదాయ సంస్కారన్ని ఆదునిక విలువలను మేళవించి పద్యాన్ని వచన కవితను సమ ఉజ్జీగా పండించిన తిరునగరి కవితా ధార గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు. 

telangana cm kcr condolence to dasarathi award winner tirunagari ramanujayya death - bsb
Author
Hyderabad, First Published Apr 26, 2021, 11:09 AM IST

రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సంప్రదాయ సంస్కారన్ని ఆదునిక విలువలను మేళవించి పద్యాన్ని వచన కవితను సమ ఉజ్జీగా పండించిన తిరునగరి కవితా ధార గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరించుకున్నారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

దాశరథి పురస్కార గ్రహీత, పండితుడు తిరుగునగరి ఆదివారం కన్నుమూశారు. హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.  తిరునగరి యాదాద్రి జిల్లా రాజపేట మండలంలోని బేగంపేట గ్రామంలో జానకిరామక్క, శ్రీ మనోహర్ దంపతులకు 1945 సెప్టెంబర్ 24న జన్మించారు. 

దాశరథి పురస్కార గ్రహీత తిరుగునగరి కన్నుమూత...

ఉద్యోగ జీవితకాలంలో యాదాద్రి జిల్లా ఆలేరులో స్థిరపడ్డారు.. ప్రస్తుతం చింతల్ లోని గణేశ్ నగర్ లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. తిరునగరి జీవితం-సాహిత్యం అనే అంశం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పరిశోధనలు జరిగాయి.

తిరునగరి ‘కొవ్వొత్తి, వసంతంకోసం, అక్షరధార, గుండెలోంచి, ముక్తకాలు, మాపల్లె, మనిషికోసం, వానా-వాడూ, ఈ భూమి, నీరాజనం, ప్రవాహిని, ఉషోగీత, జీవధార, ఒకింత మానవత కోసం, యాత్ర, కొత్తలోకం వైపు, కిటికీలోంచి, సముద్రమథనం కవితా సంపుటులను వెలువరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios