తెలంగాణ వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపడతామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల వద్దకే వైద్యం అనే లక్ష్యంతో బస్తీ, పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు.
వైద్య రంగాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ . రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం (super speciality hospitals) చేపడుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను (nursing colleges) నిర్మిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లు, నర్సింగ్ కాలేజ్ సీట్ల సంఖ్యను పెంచామని సీఎం వెల్లడించారు. ప్రజల వద్దకే వైద్యం అనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలు (basti dawakhana) ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
అదే స్పూర్తితో తెలంగాణ వ్యాప్తంగా పల్లె దవాఖానాలు (palle dawakhana) ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించి ఆరోగ్య తెలంగాణ కోసం బాటలు వేస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవల పరిధిని పెంచామని.. ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో పాటు వైద్య సిబ్బంది వేతనాలను పెంచుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. వైద్య శాఖలో 21,073 పోస్టులు కొత్తగా మంజూరు చేశామని సీఎం పేర్కొన్నారు. వైద్యులకు యూజీసీ నిబంధనలతో పీఆర్సీని అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో వైద్యవిద్యనభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు మేలు చేకూర్చడం కోసం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు ముఖ్యమంత్రి
కాగా కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) కేసీఆర్ లేఖ (kcr) రాసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో 700 మంది తెలంగాణ విద్యార్ధులు మెడిసిన్ (medicine students in ukraine) చదువుతున్నారని.. కోర్సు పూర్తవ్వకుండానే ఇక్కడికి వచ్చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల కోర్సుల పూర్తికి ఫీజులు భరించాలని తాము నిర్ణయించామని.. దీనిపై త్వరగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. Ukraine నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్ధులు ఇటీవల supreme Court ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో petition వేసిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ విద్యార్ధులున్నారు.ఉక్రెయిన్ లో తాము అసంపూర్తిగా వదిలేసిన కోర్సులను భారత్ లో పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్ధులు కోరుతున్నారు. భారత్ లో ఈ కోర్సులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్ధులు కోరారు. 2 వేల మందికి న్యాయం చేయాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో విద్యార్ధులు కోరారు.
