Asianet News TeluguAsianet News Telugu

మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఉమెన్స్ డే సందర్భంగా కేసీఆర్ కీలక నిర్ణయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో వుందని సీఎం కేసీఆర్ అన్నారు.

telangana cm kcr announces leave for women employees ksp
Author
Hyderabad, First Published Mar 7, 2021, 5:10 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో వుందని సీఎం కేసీఆర్ అన్నారు.

మహిళా సాధికారికతే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలలు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మహిళలకు అవకాశమిస్తే అద్బుతాలు చేస్తారని కేసీఆర్ కొనియాడారు. 

పురుషుడితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళా తన ప్రతిభను చాటుకుంటున్నదన్నారు. జనాభాలో సగంగా వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.

మహిళల భద్రత కోసం షీ టీమ్స్ , వృద్ధ మహిళలు , ఒంటరి మహిళలు , వితంతువులకు పింఛన్లు , కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ , కేసీఆర్ కిట్ , అంగన్ వాడీ , ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు . ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమంలో ముందంజలో ఉందని సీఎం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios