Asianet News TeluguAsianet News Telugu

రైతులకు కేసీఆర్ తీపికబురు.. రుణమాఫీ కోసం రూ. 1,200 కోట్లు విడుదల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు తీపికబురు చెప్పారు రుణమాఫీకి సంబంధించి రూ.1,200 కోట్లను బుధవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ బతికున్నంతకాలం రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందన్నారు. 

Telangana cm kcr announces farm loan waiver
Author
Hyderabad, First Published May 5, 2020, 11:11 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు తీపికబురు చెప్పారు రుణమాఫీకి సంబంధించి రూ.1,200 కోట్లను బుధవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ బతికున్నంతకాలం రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐదున్నర లక్షల మంది రైతులకు రుణం మాఫీ జరుగుతుందన్నారు. పింఛన్ల విషయంలో రాజీపడమని.. రైతులకు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. రైతులకు లేని కంగారు కాంగ్రెస్ నేతలకే ఉందని.. వాళ్లకు ఏ విషయం, ఎప్పుడు ఎత్తుకోవాలో తెలియదని సీఎం సెటైర్లు వేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో మాటిచ్చారని.. రుణమాఫీ ఎందుకు చేయట్లేదని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా... మరి ఎందుకు అడగరని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పల్లెలు ఆర్ధికంగా బలంగా తయారవ్వాలని సీఎం ఆకాంక్షించారు.

కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని.. లేదంటే ప్రజలు నవ్వుతారని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చిపనులు చేసుకుని అభాసుపాలు కావొద్దని హితవు పలికారు. ఐదున్నర లక్షల మంది రైతుల రుణం మాఫీ చేస్తామని... రూ.25 వేల లోపు ఉన్న వారికి రేపే రుణమాఫీ జరుగుతుందని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందన్న ముఖ్యమంత్రి .... దేశ చరిత్రలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనన్నారు. మద్ధతు ధర ఇచ్చి వాళ్ల దగ్గరకే వెళ్లి పంటను కొన్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. రైతులు కూడా సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

రైతులను కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో వందశాతం ధాన్యాన్ని కొంటున్నామన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు మద్ధతు ధర పేరుతో మోసం చేశారని.. ఛత్తీస్‌గఢ్‌లో  పంట కొనుగోలు చేయకపోవడంతో అక్కడి రైతులు భూపాలపల్లికి వస్తున్నారని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్‌వాళ్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. రైతు బంధు అందరికీ వందశాతం ఇస్తున్నామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios