హైదరాబాద్: ఆధ్మాత్మికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి తన భక్తిపారవశ్యాన్ని నిరూపించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు దేవతామూర్తుల పేర్లను పెట్టి తనకు ఉన్న ఆధ్మాత్మికతను నిరూపించారు.  

మేడిగడ్డ బ్యారేజీకి లక్ష్మీ బ్యారేజీగా, కన్నెపల్లి పంప్‌హౌస్‌కి లక్ష్మీ పంప్‌హౌస్‌గా నామకరణం చేశారు. అలాగే అన్నారం బ్యారేజీకి సరస్వతి బ్యారేజీగా, సిరిపురం పంప్‌హౌస్‌కు సరస్వతి పంప్‌హౌస్‌గా కేసీఆర్ నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

అంతేకాకుండా సుందిళ్ల బ్యారేజీకి పార్వతి బ్యారేజీగా, గోలివాడ పంపుహౌస్‌కు పార్వతి పంపుహౌస్‌గా నామకరణం చేయగా, నంది మేడారం రిజర్వాయర్‌కు నంది పేరును లక్ష్మీపురం పంపుహౌస్‌ కు గాయత్రి పేరు పెట్టారు.  

ఇప్పటి వరకు నదులకు దేవతామూర్తుల పేర్లు మాత్రమే చూశాం. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ బ్యారేజీలు, పంప్ హౌస్ లకు కూడా దేవతామూర్తుల పేర్లు పెట్టి చరిత్ర సృష్టించారు.