తెలంగాణ ప్రభుత్వం  అందిస్తున్న ఆసరా  పించన్లను పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట బహిరంగసభలో ప్రకటించారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే దివ్యాంగులకు పించన్ రూ.3,016 నుండి రూ.4.016 కు పెంచిన బిఆర్ఎస్ ప్రభుత్వం మిగతా పించన్లను కూడా పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే మరో వెయ్యిరూపాయలు పెంచి వృద్దులు, ఒంటరి మహిళలతో పాటు వివిధ వర్గాల వారికి పించన్ అందించనున్నట్లు ప్రకటించారు. ఇలా ఇప్పటివరకు నెలకు రూ.2016 పించన్ అందుకుంటున్నవారంతా త్వరలో రూ.3,016 అందుకోనున్నారన్న మాట. సీఎం ప్రకటన తర్వాత ఆసరా పించన్ల పెంపును అమలుచేసే ప్రక్రియను బిఆర్ఎస్ ప్రభుత్వం వేగవంతం చేసింది.

దివ్యాంగులకు పెంచినట్లే తమకు కూడా పించన్లు పెంచాలని కోరుతుండటంతో సూర్యాపేట సభలో దీనిపై కేసీఆర్ స్పందించారు. త్వరలోనే ఆసరా పించన్లు పొందుతున్నవారు మరో వెయ్యిరూపాయలు అదనంగా అందుకోనున్నారని తెలంగాణ. పించన్ మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే ఆసరా పించన్ల పెంపుకు సంబంధించిన నివేదికను పంచాయితీరాజ్ శాఖ సిద్దం చేసి ఆర్థిక శాఖకు పంపినట్లు సమాచారం. ఆర్థిక శాఖతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తర్వాత అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తిచేసి పెరిగిన పించన్లు అందించడానికి కేసీఆర్ సర్కార్ వడివడిగా చర్యలు చేపట్టింది. 

Read More పెన్షన్ కోసం తెలంగాణ సచివాలయం ముట్టడికి దివ్యాంగుల యత్నం: ఉద్రిక్తత, అరెస్ట్

ఆసరా పించన్ల పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.450 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనావేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులతో పాటు వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బిడీ, చేనేత, గీత కార్మికులు, వృద్ద కళాకారులు,డయాలసిస్ పేషెంట్లు ఇలా మొత్తం 44 మందికిపైగా పించన్లు అందుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి ఏడాది రూ.11,628 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. మరో వెయ్యి రూపాయల పించన్ పెంపు ద్వారా ప్రభుత్వంపై మరింత బారం పడనుంది.