తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే గణేష్ గుప్తాను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ రోజు నిజామాబాద్ లో పర్యటించిన కేసీఆర్.. పర్యటనలో భాగంగా మాక్లూర్ మండల కేంద్రానికి వచ్చి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ను పరామర్శించారు. 

గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి ఇటీవల మరణించారు. ఇవ్వాళ మాక్లురుకు వచ్చిన సీఎం కృష్ణమూర్తి చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. 

సీఎం తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మంత్రులు హరీష్ రావ్, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, ఎంపీలు సురేష్ రెడ్డి, బిబి పాటిల్ ఎమ్మెల్యేలు జీవన్  రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్దన్ తదితరులు కూడా గణేష్ గుప్తా ను పరామర్శించారు. అనంతరం కృష్ణమూర్తి స్మారక ప్రకృతి వనాన్ని సీఎం ప్రారంభించారు.