హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. శుక్రవారం నాడు సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్సీ పదవులకు ముగ్గురి పేర్లకు ఆమోదం తెలపనుంది కేబినెట్.

ఈ ఎమ్మెల్సీ పదవుల్లో సామాజిక సమతుల్యత పాటించాలని కూడ కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. దీంతో ఎస్సీ, బీసీ, ఓసీలకు ఎమ్మెల్సీ పదవులను కేటాయించాలని భావిస్తోంది.

 

ముగ్గురి పేర్లకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ కు పంపుతారు.  అంతా అనుకొన్నట్టుగా జరిగితే రెండు రోజుల్లోనే ముగ్గురు ఎమ్మెల్సీలతో ప్రమాణం స్వీకారం పూర్తి చేయనున్నారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురి పదవీ కాలం పూర్తైంది. దీంతో ఈ ముగ్గురి స్థానంలో ముగ్గురికి చోటు కల్పించనున్నారు.

నాయిని నర్సింహ్మారెడ్డి కర్నె ప్రభాకర్, రాములు నాయక్ లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాయిని నర్సింహ్మారెడ్డి గత మాసంలో మరణించారు. దీంతో నాయిని నర్సింహ్మారెడ్డి కుటుంబంలో ఎవరికైనా చోటు కల్పిస్తారా అనేది  ఇంకా స్పష్టత రాలేదు.బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల్లో ఎవరికి చోటు దక్కుతోందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.