కేరళ : తెలంగాణలో ఎన్నికలు ముగియడంతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటకలో కుమారస్వామి తనయుడు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. 

ఇకపోతే తెలంగాణ ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సైతం కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సై అన్నారు. కేరళలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

త్రిసూర్ లోక్ సభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. త్రిసూర్ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి టి.ఎన్ ప్రతాపన్ కు మద్దతుగా భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా రాజాజి మాథ్యూ, బీజేపీ అభ్యర్థిగా సినీనటుడు సురేష్ గోపి పోటీ చేస్తున్నారు.