Asianet News TeluguAsianet News Telugu

టీ.కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలే.. త్వరలోనే కమిటీ, భట్టికీ కేసీ వేణుగోపాల్ హామీ

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బిజీబిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా శనివారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్‌తో భట్టి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్ధితి, వ్యవహారాలపై ఇద్దరు నేతలు చర్చించారు

telangana clp leader bhatti vikramarka meets kc venugopal ksp
Author
New Delhi, First Published Jul 3, 2021, 10:19 PM IST

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బిజీబిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా శనివారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్‌తో భట్టి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్ధితి, వ్యవహారాలపై ఇద్దరు నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ మౌలిక, మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే నిర్ణయాలు, తెలంగాణలో పార్టీ పరంగానే సమిష్టి నిర్ణయాల అంశంపై చర్చిస్తున్నారు. 

పార్టీ ప్రయోజనాలపై ఏకపక్ష నిర్ణయాలుండవని భట్టీకి వేణుగోపాల్ హామీ ఇచ్చారు. సీఎల్పీతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయాలు వుండవని ఆయన స్పష్టం చేశారు. అధిష్టానం కనుసన్నల్లోనే తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు, నిర్ణయాలు వుంటాయని వేణుగోపాల్ తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

Also Read:మరియమ్మ లాకప్ డెత్: మల్లు భట్టి విక్రమార్క పోరుకు మాణిక్యం ఠాగూర్ ఫిదా

అంతకుముందు తెలంగాణలో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ మీద సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన పోరాటాన్ని కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ ప్రశంసించారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిపించడంలో మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారని ఆయన అన్నారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిగిందని ఆయన అన్నారు.

మల్లుభట్టి విక్రమార్క మాణిక్యం ఠాగూర్ తో భేటీ అయ్యారు. తాము ప్రస్తుత తెలంగాణ రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు మాణిక్యం ఠాగూర్ తెలిపారు. మల్లు భట్టి విక్రమార్కతో రాజకీయ, సంస్థాగత వ్యవహారాల గురించి మాట్లాడినట్లు ఆయన చెప్పారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కాంగ్రెసు ఎమ్మెల్యేలు పెట్టిన ఒత్తిడి కేసీఆర్ ప్రభుత్వం వద్ద పనిచేసిందని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ విషయాలను వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios