టీ.కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం నేపథ్యంలో తన పాదయాత్రకు భట్టి విక్రమార్క బ్రేక్ ఇచ్చారు.

టీ.కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అనారోగ్యం నేపథ్యంలో తన పాదయాత్రకు భట్టి విక్రమార్క బ్రేక్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

మరోవైపు .. భట్టి నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కేతపల్లి మీదుగా సాగుతోంది. ఇవాళ 97వ రోజు పాదయాత్రలో భాగంగా కేవలం ఆరున్నర కిలోమీటర్లు మాత్రమే ఆయన నడిచారు. ఈ లోపు అస్వస్థతకు గురికావడంతో భట్టికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు .. ఎండలో తిరగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయి, షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. వైద్యుల సూచన మేరకు భట్టి విక్రమార్క తన పాదయాత్రకు విరామం ప్రకటించారు.