రాష్ట్రంలో వరదలు, వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు వరద అంచనాలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రజా అవసరాలు తీర్చడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలోని వరదలు, వర్షాల నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) స్పందించారు. వరద సహాయక చర్యల్లో (rescue operation) పాల్గొనాలని కాంగ్రెస్ (congress) శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బాధితులకు నిరంతరం అండగా ఉండాలని విక్రమార్క సూచించారు. రాష్ట్రంలో వరదల తీవ్రత భయంకరంగా ఉందని...ప్రజలు ఆస్తులు, పంటలు, ఇళ్లు అన్ని కోల్పోయి నష్టాల్లో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఆహారం, పాలు, మంచినీరు, మందులు, నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, బట్టలు ఏది అవసరం ఉంటే అది అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి పని చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా సేవలో సైనికులు లాగా పని చేసి ప్రజల అవసరాలు తీర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత కష్టాలలో ఉన్నారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వరద అంచనాలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రజా అవసరాలు తీర్చడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చడంలో ముందుండి పని చేయాలని విక్రమార్క కోరారు.
Also Read:భద్రాచలానికి హెలికాప్టర్, రక్షణ సామాగ్రి: సీఎస్ సోమేష్ కుమార్ కు కేసీఆర్ ఆదేశం
మరోవైపు.. గోదావరికి (godavari) భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) ఆదేశించారు. హెలికాఫ్టర్‌తో పాటు ఇతర సామాగ్రిని పంపాలని కూడా ఆయన సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులను దాటే అవకాశం వుందని.. ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్ధితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే భద్రాచలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
