తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య  ప్రాణాలు కోల్పోయారు. రామ్ ఘర్ ఆలయం దర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలోఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్: తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ ప్రయాణీస్తున్న వాహనానికి సోమవారం నాడు రాజస్థాన్ రాష్ట్రంలో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ భార్యఅక్కడికక్కడే మరణించారు. డ్రైవర్,మరొకరు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదంలో సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ గాయాలతో బయటపడ్డాడు. రాంఘర్ లోని మాతేశ్వరి దేవాలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన స్థలంలోనే డీఐజీ గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ మరణించింది. గోవింద్ సింగ్ ఆయన డ్రైవర్ విజయేందర్ , మరొకరు ఈ ఘటనలో గాయపడ్డారు. 

 గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు రాజస్థాన్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో ఈ విషయమై మాట్లాడారు. డీజీ గోవింద్ సింగ్ సహా ఇతరుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. 
1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి గోవింద్ సింగ్ సీఐడీ అడిషనల్ డీజీగా ఉన్నాడు. ఆయనను ఏసీబీ డీజీగా 2021 సెప్టెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం నియమించింది.