హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం అనంతరం సీఎం నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణ నివాసానికి వెళ్లి కలిశారు. 

ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ నరసింహన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ్యుల ప్రమాణస్వీకారం, ఉమ్మడి హైకోర్టు విభజన వంటి పలు అంశాలపై చర్చించారు. దాదాపు గంటకు పైగా సీఎం, గవర్నర్‌ మధ్య అంతర్గత చర్చలు జరిగాయి.