Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉపఎన్నిక ... ఆర్వోపై వేటు అందుకే : తెలంగాణ సీఈవో వికాస్ రాజ్

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే ఆర్వోపై వేటు వేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. మునుగోడులో నిఘా టీమ్‌లు పెంచామని... పోలీస్ బందోబస్త్, కేంద్ర బలగాలు వచ్చాయని సీఈవో వెల్లడించారు. 

telangana ceo vikas raj comments on munugode bypoll arrangements
Author
First Published Oct 22, 2022, 5:54 PM IST

మునుగోడు ఉపఎన్నికను పురస్కరించుకుని ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పర్యటించారు. శనివారం ఆయన మునుగోడు మండలం పలివేల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వికాస్ రాజ్ చెప్పారు. మునుగోడులో నిఘా టీమ్‌లు పెంచామని... పోలీస్ బందోబస్త్, కేంద్ర బలగాలు వచ్చాయని ఆయన తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే ఆర్వోపై వేటు వేసినట్లు వికాస్ రాజ్ పేర్కొన్నారు. 

ఇకపోతే.. మునుగోడు ఉపఎన్నిక వేళ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఓటర్లతో ప్రమాణం చేయించడంపై ఎన్నికల కమీషన్ సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. మునుగోడు నియోజకవర్గానికి చెందిన 300 మందిని బస్సుల్లో తీసుకెళ్లారని ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టింది. యాదాద్రి దర్శనాలు, ఓటర్లతో ప్రమాణం చేయించడాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఫోటోలు, వీడియో సాక్ష్యాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. 300 మంది ఓటర్లకు ఆలయ దర్శనం కోసం చేసిన ఖర్చును అభ్యర్ధి ఖాతాలో పొందుపరచాలని ఆదేశించింది ఈసీ. 

Also REad:యాదాద్రికి 300 మంది ఓటర్లు, వారితో ప్రమాణాలు... ఈసీ సీరియస్‌, టీఆర్ఎస్ నేతలపై చర్యలకు ఆదేశం

అంతకుముందు మునుగోడు ఉపఎన్నిక ఏర్పాట్లలో లోపాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. షిప్‌కు బదులుగా మరో గుర్తును ముద్రించిన అధికారిపై వేటు వేశారు. మండల రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేస్తూ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు చేశారు. అలాగే బ్యాలెట్ పత్రాల ముద్రణ పనిలో వున్న ఇతర అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios