తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఈ నెల 29న కేబినేట్ భేటీ.. చివరి సమావేశం ఇదేనా..?
Telangana Cabinet: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. పలు సంక్షేమ,అభివృద్ది పనులపై ఫోకస్ చేస్తూ.. కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు పెండింగ్ పనులపై ఈ భేటీలో జరుగనున్నట్టు తెలుస్తోంది.

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నెల 29న కేబినెట్ భేటీ కానున్నది. ఈ సమావేశంలో పలు కీలక ఆంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, కొత్త పథకాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణ వంటి పలు అంశాలను చర్చించున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. గవర్నర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పు బట్టారు. తమిళిసై ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెను గవర్నర్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై తదుపరి తీసుకోవాల్సిన విషయాలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ ప్రకటించడం. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో సంక్షేమ,అభివృద్ది పనులపై ఫోకస్ చేస్తూ.. కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు పెండింగ్ పనులను పూర్తి విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.