హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ప్రారంభమైంది. ఏప్రిల్ 20వ తర్వాత కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ విషయమై మంత్రివర్గం చర్చించనుంది.

రేపటి నుండి రెడ్ జోన్ మినహా ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ పై సడలింపులు ఇవ్వాలా వద్దా అనే విషయమై చర్చించేందుకు ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. దీనికి తోడు ఈ నెల 24వ తేదీ నుండి రంజాన్ ప్రారంభం కానుంది. 

also read:రెండేళ్ల బాలుడికి కరోనా: క్వారంటైన్‌కి 200 మంది నిలోఫర్ సిబ్బంది

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందులు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ విషయమై కూడ కేబినెట్ చర్చించనుంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైతే మత పెద్దల సహకారం తీసుకోవాలని కూడ తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే  ఈ విషయమై ఏం చేయాలనే దానిపై కేబినెట్ చర్చిస్తోంది.

వ్యవసాయంతో పాటు భవన నిర్మాణాలతో పాటు కొన్ని రంగాలకు కేంద్రం ఆంక్షలను సడలింపు ఇస్తూ కేంద్రం అనుమతి ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు కూడ నమోదు కావడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 803 కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకొంటుంది. 

కేంద్రం సూచనల మేరకు ఆంక్షలను సడలిస్తే ఏ మేరకు సడలింపు ఇవ్వాలనే విషయమై చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.