Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్ల బాలుడికి కరోనా: క్వారంటైన్‌కి 200 మంది నిలోఫర్ సిబ్బంది


హైదరాబాద్:హైద్రాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సుమారు 200 మందిని క్వారంటైన్ కు వెళ్లాలని సూపరింటెండ్ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన రెండు మాసాల బాలుడికి కరోనా సోకడంతో సూపరింటెండ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

Niloufer hospital superintendent orders to 200 personnel to move quarantine
Author
Hyderabad, First Published Apr 19, 2020, 10:24 AM IST

హైదరాబాద్:హైద్రాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సుమారు 200 మందిని క్వారంటైన్ కు వెళ్లాలని సూపరింటెండ్ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన రెండు మాసాల బాలుడికి కరోనా సోకడంతో సూపరింటెండ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

నారాయణపేట జిల్లాకు చెందిన రెండు మాసాల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు అతడిని మహాబూబ్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు కరోనా వచ్చిందనే అనుమానంతో నిలోఫర్ ఆసుపత్రికి ఆ బాలుడిని తరలించారు.

ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఆ బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. నిలోఫర్ ఆసుపత్రిలో ఆ బాలుడిని పరీక్షిస్తే కరోనా పాజిటివ్ గా తేల్చారు.ఈ నెల 15వ తేదీతో పాటు 16, 17 తేదీల్లో ఆసుపత్రిలో విధులు నిర్వహించిన  సర్జన్లు, ప్రోఫెసర్లు, అసోసియేట్ ప్రోఫెసర్లతో పాటు జూనియర్ డాక్టర్లు, పారిశుద్య సిబ్బంది, నర్సులను క్వారంటైన్ కు వెళ్లాలని  సూపరింటెండ్ శనివారం నాడు రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఈ మూడు రోజుల పాటు వివిధ షిప్టుల్లో పనిచేసిన సుమారు 200 మందిని క్వారంటైన్ కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ ఆదేశాలు కొందరికి అందాయి. మరికొందరికి ఈ ఆదేశాలు అందాల్సి ఉంది. 

అయితే ముందస్తు సమాచారం లేకుండా క్వారంటైన్ కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంపై కొందరు వైద్య సిబ్బంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios