హైదరాబాద్:  తెలంగాణ కేబినెట్ సమావేశం ఆదివారం నాడు ప్రగతి భవన్‌లో ప్రారంభమైంది.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉంటాయనే ఊహగానాలు వెలువడుతున్నాయి. అయితే సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను సభలో  సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


అగ్రవర్ణ పేదలకు వరాలను ప్రకటించేందుకు  కేసీఆర్  ప్రభుత్వం  ఈ కేబినెట్‌లో చర్చించే  అవకాశం ఉందని సమాచారం. లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ గురించి కూడ చర్చ ఉంటుందని తెలుస్తొంది.

కొత్త జోన్లకు రెండు రోజుల క్రితమే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు సమాచారం.
ఉద్యోగులకు పీఆర్‌సీ, మధ్యంతర భృతిపై కూడ  చర్చించే అవకాశం ఉంది. అయితే ఐఆర్  ఏ మేరకు ఉంటుందనే విషయమై ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఐఆర్  25 శాతంగా ఉండే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయంతో ఉన్నాయి.

వృద్ధులు, వికలాంగులు,ఒంటరి మహిళలు,  వితంతు పెన్షన్లకు ఇచ్చే  పెన్షన్లను పెంచే అవకాశం లేకపోలేదు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూడ ఊహగానాలు వెలువడుతున్న తరుణంలో ఈ విషయమై కూడ చర్చించే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది.

అయితే ఇవాళ మాత్రం కేసీఆర్ గవర్నర్ అపాయింట్ మెంట్ మాత్రం తీసుకోలేదు అయితే సభ పూర్తైన తర్వాత రాజ్‌భవన్ కు వెళ్తారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత  తెలంగాణ సీఎం కేసీఆర్  కేబినెట్ భేటీ వివరాలను  మీడియాకు వివరించనున్నారు.