హైదరాబాద్:  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ పదవులకు ముగ్గురి పేర్లను తెలంగాణ కేబినెట్ గవర్నర్ కు సిఫారసు చేసింది.శుక్రవారం నాడు తెలంగాణ కేబినెట్ సమావేశంలో  ముగ్గురి పేర్లకు ఆమోదం తెలిపింది.

నాయిని నర్సింహ్మారెడ్డి, కర్నె ప్రభాకర్, రాముల్ నాయక్ ల  పదవి కాలం పూర్తైంది. దీంతో వీరి స్థానంలో మరో ముగ్గురి పేర్లపై కేబినెట్ లో చర్చించారు. ముగ్గురి పేర్లకు కేబినెట్ ఆమోదం తెలిపి రాష్ట్ర గవర్నర్ కు పంపారు.

ప్రజా కళాకారుడుగు గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య, దయానంద్ లను ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గవర్నర్ కు కేబినెట్ సిఫారసు చేసింది.

ఈ సిఫారసు మేరకు గవర్నర్  ఈ ముగ్గురి పేర్లను  ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయనున్నారు.