Asianet News TeluguAsianet News Telugu

కొత్త రెవిన్యూ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం: కీలక అంశాలపై చర్చ

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది.టీఆర్ఎస్ శాసనసభపక్షసమమావేశం పూర్తైన తర్వాత  తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.

Telangana cabinet approves new revenue bill
Author
Hyderabad, First Published Sep 7, 2020, 9:32 PM IST

హైదరాబాద్: కొత్త రెవిన్యూ ముసాయిదా బిల్లుకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది.టీఆర్ఎస్ శాసనసభపక్షసమమావేశం పూర్తైన తర్వాత  తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.

కొత్త రెవిన్యూ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఈ నెల 9వ తేదీన అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.ఇరిగేషన్ శాఖ పేరును జల వనరుల శాఖగా మార్చే ప్రతిపాదనకు కూడ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇరిగేషన్ శాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. 

కొత్త రెవిన్యూ చట్టం తీసుకువచ్చేందుకుగానను వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. అక్రమ లేఅవుట్ల విషయంలో కూడ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది.పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ అంశంపై  కేబినెట్ లో చర్చించనున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలపై ఈ నెల 8వ తేదీన అసెంబ్లీలో చర్చ నిర్వహించనున్నారు. 

కేబినెట్ తీర్మాణాలు ఇవీ....

 తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్ 2020 కి కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ని ఆమోదించింది. తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును ఆమోదించింది.

పంచాయతీ రాజ్  రూరల్ డెవలప్మెంట్ గ్రామ పంచాయతీ, ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు2018 సవరణ బిల్లును కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు -2017 లో సవరణ బిల్లును ఆమోదించింది.

తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 ను కేబినెట్ ఆమోదం తెలిపింది. ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ ను ఆమోదించింది.టిఎస్ బిపాస్ బిల్ కు ఒకే చేసింది.తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లుకు ఒకే తెలిపింది.

ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972 కు సవరణ బిల్లును గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది.కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది..17 కులాలను బిసి జాబితాలో చేర్చాలని బిసి కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios