తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కీలక అంశాలపై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ వుంటే పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.

పదేళ్ల పాటు డివిజన్ల రిజర్వేషన్లు కొనసాగించేందుకు ఓకే చెప్పింది. కార్పోరేటర్లుకు ఇచ్చే నిధులను కూడా సవరణ చట్టంలో చర్చనుంది. కేబినెట్ ఆమోదించిన జీహెచ్ఎంసీ చట్ట సవరణ ముసాయిదా ఈ నెల 13న అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశం వుంది. సాగు, పంట కొనుగోలు, థియేటర్లు, విద్యా సంస్థల పున: ప్రారంభంపైనా మంత్రి వర్గం చర్చించింది.