Asianet News TeluguAsianet News Telugu

రూ. 2.65 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. దళిత బంధుకు రూ. 17 వేల కోట్లు.. రంగాల వారీగా కేటాయింపులు ఇవే..

Telangana Budget 2022: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సభలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 2.65 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు.

Telangana Budget 2022 total 2.65 lakh crore budget category wise allocation list here
Author
Hyderabad, First Published Mar 7, 2022, 12:14 PM IST

Telangana Budget 2022: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సభలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 2.65 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 1,89,274.82 కోట్లుగా పేర్కొన్నారు. క్యాపిటల్ వ్యయం రూ. 29,728.44 కోట్లుగా ఉంది. రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేయనున్నారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేయనున్నట్టుగా మంత్రి హరీష్ రావు తెలిపారు.

2013-14‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ. 4,51,580 కోట్లు కాగా.. అది 2021-22 నాటికి రూ. 11,54,860 కోట్లుకు చేరిందన్నారు. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ది రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందన్నారు.

బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా.. 
-పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
-పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ. 1,394 కోట్లు
-దళితబంధుకు రూ.17,700 కోట్లు
-అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
-సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి ఇళ్లు నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం
-పామాయిల్ సాగుకు ప్రోత్సహం.. రూ. 1,000 కోట్లు కేటాయింపు
-కొత్త మెడికల్ కాలేజ్‌లకు రూ. 1,000 కోట్లు 
- వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు
-హరితహారానికి రూ. 932 కోట్లు
-ఆసరా పెన్షన్లకు రూ. 11,728 కోట్లు(సవరించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా పెన్షన్)
- కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 2,750 కోట్లు 
-డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు
-ఎస్టీ సంక్షేమానికి రూ. 12,565 కోట్లు
-బీసీ సంక్షేమానికి రూ. 5,698 కోట్లు
-బ్రాహ్మణ సంక్షేమానికి రూ. 177 కోట్లు
-రోడ్లు మరమ్మతులు, బీటీ రెన్యువల్స్ నిర్వహణ గ్రాంట్ రూ. 1,542 కోట్లు 
-పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
-అటవీ విశ్వవిద్యాలయానికి రూ. 100 కోట్లు
-పంట రుణాలు రూ. 16,144 కోట్లు మాఫీ
--మన ఊరు- మన బడి రూ. 7,289 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios