తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మరికాసేపట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు.. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మరికాసేపట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎప్పటిలాగా గవర్నర్ ప్రసంగంతో కాకుండా ఈసారి ఆ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ ప్రారంభంకానుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. మానవీయ కోణంలో బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు.
2022-23 వార్షిక బడ్జెట్‌కు సంబంధించి పలు శాఖలు భారీగా నిధులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. అయితే ఖజానాకు రాబడులు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని సమాచారం. పన్నులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటాల ద్వారా ఆశించినంతగా ఆదాయం రాకపోయినా.. ఊరటనిచ్చే స్థాయిలో మాత్రం ప్రభుత్వానిక నిధులు చేతికందుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం పెద్దగా గ్రాంట్స్ రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి భూముల అమ్మకం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. దీని ద్వారానే పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని, తర్వాత ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ... బడ్జెట్‌ని రూ.2.60 లక్షల కోట్ల నుంచి రూ.2.70 లక్షల కోట్ల మధ్యలో ఖరారు చేసి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ సర్కార్.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన వుంటే మాత్రం, దానికి అనుగుణంగా ఈసారి బడ్జెట్లో సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
