హైదరాబాద్:హైద్రాబాద్ నగరంలోని బాగ్‌లింగంపల్లిలోని ఈడబ్ల్యుఎస్ కాలనీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా బీజేపీ సభ్యత్వాన్ని చేర్పించారు.

సోమవారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కాలనీలో ఇల్లిల్తూ తిరిగి సభ్యత్వాన్ని చేర్పించారు.ఆ తర్వాత అంబేద్కర్ కాలేజీలో ఆయన మొక్క నాటారు.  ఆదివారం నాడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు జేపీ నడ్డా హైద్రాబాద్ వచ్చారు.

టీడీపీతో పాలు పలు పార్టీలకు చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరారు. మెజారిటీ టీడీపీ నేతలు బీజేపీలో చేరారు.తెలంగాణలో సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో నిలిపేందుకు గాను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం నుండే కేంద్ర మంత్రి అమిత్ షా కూడ బీజేపీ సభ్వత్వం తీసుకొనే అవకాశం ఉంది.

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా హైద్రాబాద్ లో భారీ సభను నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు.