Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఏర్పాటులో బిజెపి కీలకం : లక్ష్మణ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 7వ తేదీన జరిగిన పోలింగ్ ప్రక్రియలో పార్టీల భవితవ్యం నిక్షిప్తమవగా...రేపు(మంగళవారం) జరిగే ఓట్ల లెక్కింపుతో బయటపడనుంది. దీంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నా....ప్రముఖ పార్టీలన్ని తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్ సంచలన ప్రకటన చేశారు. 
 
telangana bjp president laxman comments on votes counting
Author
Hyderabad, First Published Dec 10, 2018, 5:40 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 7వ తేదీన జరిగిన పోలింగ్ ప్రక్రియలో పార్టీల భవితవ్యం నిక్షిప్తమవగా...రేపు(మంగళవారం) జరిగే ఓట్ల లెక్కింపుతో బయటపడనుంది. దీంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నా....ప్రముఖ పార్టీలన్ని తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్ సంచలన ప్రకటన చేశారు. 

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ కీలకంగా వ్యవహరించనుందని లక్ష్మణ్ అన్నారు. తాము మద్దతిచ్చే పార్టీనే అధికారంలోకి వస్తుందని... అయితే ఏ పార్టీకి మద్దతిచ్చేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. బిజెపి రాష్ట్రవ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసిందని...అందువల్ల తమకు గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని లక్ష్మణ్ తెలిపారు. 

తెలంగాణలో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించడంలో ఎన్నిరల సంఘం విపలమైందని లక్ష్మణ్ విమర్శించారు. ఎన్నికలకు తాము సిద్దంగా వున్నామన్న ఈసి...లక్షల ఓట్లు గల్లంతవడానికి కారణమైందన్నారు. ఇలా ప్రజలను ఎన్నికల సంఘం నిరాశపర్చిందని లక్ష్మణ్ ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios