Asianet News TeluguAsianet News Telugu

దళితులపై దాడులు చేయమని టీఆర్ఎస్‌ నేతలకు లైసెన్స్‌లు: బండి సంజయ్ వ్యాఖ్యలు

దళితులపై దాడులు ఆనవాయితీగా మారారని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితులపై దాడులు చేసేందుకు టీఆర్ఎస్ లీడర్లకు లైసెన్సులు ఇచ్చారని ఆరోపించారు

telangana bjp president bandi sanjay comments on trs leaders ksp
Author
Hyderabad, First Published Jun 27, 2021, 2:26 PM IST

దళితులపై దాడులు ఆనవాయితీగా మారారని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితులపై దాడులు చేసేందుకు టీఆర్ఎస్ లీడర్లకు లైసెన్సులు ఇచ్చారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంజయ్ మండిపడ్డారు. అనేక చోట్ల దళితులపై దాడులు జరిగితే కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా, దళితుల సాధికారతపై ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా వుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇక అఖిలపక్ష సమావేశానికి వామపక్షాల నుండి సిపిఐ నుండి పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపిఎం నుండి ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మరో ఇద్దరు పార్టీ సభ్యులు కూడా హజరుకానున్నారు.

Also Read;దళితులకు సామాజిక ఆర్ధిక బాధలు పోవాలి:అఖిలపక్షంలో కేసీఆర్

ఇప్పటికే శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలోనే దళితుల అభివృద్ది కోసం సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి అభివృద్దికి ప్రత్యేకంగా వేయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించనున్నట్టు ప్రకటించారు. ఇతర పథకాలతో సంబంధం లేకుండా వీటిని దళితులకు నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై విధివిధానాలు నేటి సమావేశంలో ఖారారు కానున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios