శుక్రవారం వేములవాడలో పర్యటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
వేములవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కోతలరాయుడని... ఇప్పుడు డిల్లీకి వెళ్లింది కూడా కోతలు కోయడానికేనంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. అబద్దాలు చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి వెళ్ళాడని ఆరోపించారు.
శుక్రవారం వేములవాడలో పర్యటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కూపంలోకి నెట్టాడన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చావుదెబ్బ కొట్టామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏనాడైనా ధర్నాలు చేశారా?అంటూ సీఎంను ప్రశ్నించారు. రైతుల కోసమంటూ ఇటీవల చేపట్టిన భారత్ బంద్ విఫలం అయ్యిందన్నారు. రైతులకు మద్దతు ధర కోసమే కేంద్రం నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకువస్తే దాన్ని సీఎం కేసీఆర్ వ్యతిరేకించండం హాస్యాస్పదంగా వుందన్నారు.
''రాష్ట్రంలోని రైతులు సన్న బియ్యానికి రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఈ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. రైతులకు సన్న బియ్యం పండిచాలని రైతులకు చెప్పి తన ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డు బియ్యం పండిచారని ఆరోపించారు. గ్రామాల్లో కార్పొరేట్ వారు రావద్దా? అంటూ ప్రశ్నించారు
హైదరాబాద్ వరద బాధితులకు రూ.10,000 ఇచ్చిన విధంగా రాష్ట్ర మొత్తం ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. అహంకారంతో రాజ్యం చేస్తున్న కేసీఆర్ కు రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల14 న ఆందోళన చేపడతామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే మిడ్ మానేరు ముంపు గ్రామాలలో పర్యటించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల భాదితులతో కలిసి రాష్ట్ర గవర్నర్ ను కలుస్తామని వెల్లడించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 11, 2020, 8:15 PM IST